బడ్జెట్ శభాష్ అన్న ఏపీ మంత్రి

Update: 2018-02-02 13:08 GMT

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని ఏపీ మంత్రి మాణిక్యాలరావు అభిప్రాయపడ్డారు. బడ్జెట్ ను పూర్తిగా స్టడీ చేయకుండా అపోహలు పెంచుకోవడం సరికాదన్నారు. పదిరోజుల్లో ఇప్పుడు బడ్జెట్ పై విమర్శించినవారే పొగిడే రోజులు వస్తాయని మంత్రి మాణిక్యాల రావు అన్నారు. ఇతర రాష్టాలను, ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం వేరుగా చూడదన్నారు. అన్ని రాష్ట్రాలతో సమానంగానే ఏపీని కూడా చూస్తారన్నారు. డీపీఆర్ లేనందునే రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదని మాణిక్యాలరావు చెప్పారు. పోలవరం విషయంలో కూడా ఇలాంటి అపోహలే తొలుత పెట్టుకున్నారని, తర్వాత కేంద్రమంత్రి గడ్కరీ స్వయంగా వచ్చి క్లియర్ చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు మాణిక్యాలరావు.

Similar News