పందెంరాయుళ్లకు హైకోర్టు షాక్

Update: 2018-01-04 10:47 GMT

సంక్రాంతి అంటే కోడిపందేలు. కోట్ల రూపాయల్లో బెట్టింగ్ లు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడిపందేల సంగతి చెప్పనక్కర్లేదు. అయితే కోడిపందేలపై హైకోర్టు సీరియస్ అయింది. ఎట్టిపరిస్థితుల్లో కోడిపందేలు జరగడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. గతంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఏమేం చర్యలు తీసుకున్నారో తెలపాలని కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. గతంలో నిబంధనలను ఉల్లంఘించిన 43 తహసిల్దార్లు, 49 మంది ఎస్పైలపై ఏమేం చర్యలు తీసుకున్నారో ఈ నెల 22వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెనల 22కు వాయిదా వేసింది.

Similar News