నోట్ల రద్దుకు జై కొడుతున్న అల్లు వారి హీరో

Update: 2016-11-30 13:50 GMT

మెగా ఫామిలీ నటులలో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న వారు మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఇద్దరు బ్రదర్స్ ఒకే మాట మీద ఉండేవారు. చిరంజీవి సొంత రాజకీయ పార్టీ ప్రజా రాజ్యం స్థాపించిన నాటికి కూడా పవన్ కళ్యాణ్ అన్నకు అందగానే వున్నారు. ఏడాది తిరిగే సరికి ప్రజా రాజ్యం కాస్తా అప్పటి పాలక వర్గం ఐన కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేయటంతో అన్నదమ్ముల మధ్య దూరం పెరిగింది. వ్యక్తిగత తగాదాలు లేనప్పటికీ రాజకీయం వీరిని విడదీసింది. ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా మారగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యవస్థలో లోపాలను ప్రశ్నిస్తానంటూ తనకి తాను జనసేన పేరుతో కొత్త వేదికకు శ్రీకారం చుట్టుకుని అన్నయ్య రాజకీయ విధానాలకు ఎదురు వెళ్తాను తప్ప వ్యక్తిగతంగా అన్నయ్యని ఎదిరించే అర్హత కూడా తనకు లేదు అంటూ పలుమార్లు వెల్లడించారు పవన్ కళ్యాణ్.

ఇక ఇప్పుడు మెగా ఫామిలీ యువ నటులలో ఒకరు ఐన అల్లు శిరీష్ ఇద్దరు మామయ్యలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చర్యలను సమర్ధిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా వుండే అల్లు శిరీష్ తన ట్విట్టర్ ద్వారా, "పెద్ద నోట్ల రద్దు చర్యను కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోస్తూ సామాన్య ప్రజలను తప్పు దోవ పట్టిస్తుంది. మహారాష్ట్రలో సామాన్య ప్రజలు పాల్గొన్న సర్వే లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు చర్య ఆమోదించిన ప్రజల నిర్ణయంతో నైనా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగి వున్న ఈ సాహసాన్ని విమర్శించకుండా సహకరిస్తారని కోరుకుంటున్నా." అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు అల్లు శిరీష్.

ప్రతిపక్షాలలోను ముఖ్యంగా తన మామయ్య చిరంజీవి పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పేరు లేవదీసి కేంద్ర ప్రభుత్వ చర్యను శిరీష్ ప్రశంసించటంతో ఈ ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది.

Similar News