నేడు తెలంగాణలో మొక్కల పండగ

Update: 2017-07-12 02:36 GMT

తెలంగాణలోని 31 జిల్లాల్లో నేడు హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మూడో విడత చేపట్టనున్న ఈ కార్యక్రమంలో మొత్తం 40 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం నర్సరీల్లో ఇప్పటికే మొక్కలను సిద్ధం చేశారు. ఒక పండగలా హరితహారం కార్యక్రమాన్ని జరుపుకోవాలని ముఖ్యమంత్రి పిలుపు నిచ్చారు. తెలంగాణలో పచ్చదనం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. మూడు వేల నర్సరీల్లో మొక్కలను పెంచారు. ఇంటింటికీ కూడా మొక్కలను పంపిణీ చేయనున్నారు. సీడ్ బాల్స్ విధానంలో కూడా మొక్కలను నాటుతున్నారు. కొన్ని చోట్ల మొక్కలకు ట్రీ గార్డులను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొక్కల సంరక్షణకు ప్రజలు కూడా సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

Similar News