డీకే అరుణ క్షమాపణ చెప్పాల్సిందే !

Update: 2016-03-22 16:11 GMT

తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను డీకే అరుణ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే అని మంత్రి హరీష్‌రావు అన్నారు. సంస్కారం లేని వారు సభ నడుపున్నారని డీకే అరుణ అన్నారు. సంస్కారం లేనిది ఆ వ్యాఖ్యలు చేసిన వారికా లేక సభ నడుపుతున్న వారికా అని హరీష్ ప్రశ్నించారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హుందాగా సభ నడుపుతున్న వారిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. డీకే అరుణ తన వ్యాఖ్యలపై భేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్ డిమాండ్ చేశారు.

Similar News