డామిట్....! సంక్రాంతికి ఈ దొంగల్లుడు అడ్డంగా దొరికాడే...!

Update: 2018-01-16 13:19 GMT

అప్పులు చేసాడు. అప్పుల తిప్పలు తప్పించుకునేందుకు అత్తింటికే కన్నం వేసాడు. పోలీసులకు దొరక్కుండా సినీఫక్కీలో పోలీసులను తప్పుదోవ పట్టించ్చాడు. డామీట్ సీసీ కెమెరాలు ఆ ఇంటిదొంగను పట్టించాయి. గత నెల 30న హైదరాబాద్ ఎస్సార్ నగర్ లో జరిగిన ఓ చోరీ కేసులో దొంగల్లున్నిఅరెస్ట్ చేసిన పోలీసులు లక్ష రూపాయల నగదు 12 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

అల్లుడికి అప్పగిస్తే....

అతడి పేరు హార్రీ ఆంథోని. ముషీరాబాద్ హరిరామ్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. ఎస్సార్ నగర్ తులసీ నగర్ లో ఉంటున్న బీ.ఆంథోని కూతురును హర్రీ ఆంథోని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. నవంబర్ లో భార్యతో కలిసి అమెరికా వెళ్ళిన బీ.ఆంథోని ఇంటి బాధ్యతలు తన తల్లితో పాటు అల్లుడు హర్రీ ఆంథోనికి అప్పగించి వెళ్ళాడు. మామ ఇంట్లో ఉన్న బంగారం క్యాష్ పై అప్పటికే కన్నేసిన ఆంథోని ఇదే అదునుగా అత్తింట్లో చోరీకి ప్లాన్ చేసాడు. అందుకోసం గత నెల 30వ తేదీ నైట్ దోపిడికి ముహూర్తం పెట్టుకున్నాడు. ఎలాగో సిటీలో సంక్రాంతి, దొంగలు పడే ఛాన్స్ ను ఆసరాగా తీసుకుని పక్కా స్కెచ్ వేసి మామ ఇంటిని లూఠీ చేసాడు.

తన ప్లాన్ అమలు ఇలా....

ఇలా తన ప్లాన్ లో భాగంగా ఇంటి కిటికీల గ్రిల్స్ ను తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన ఆంథోని.. బెడ్ రూమ్ లో ఉన్న 18 తులాల బంగారు ఆభరణాలు 2లక్షల 50వేల నగదును దొంగిలించాడు. దీంతో పాటు తనను గుర్తించకుండా ఇంట్లో ఉన్న మామగారి తల్లి అనంతమ్మపై దాడి చేసాడు. రాత్రి సమయం కావడంతో వృద్దురాలు ఆంథోనిని గుర్తించలేదు. దీంతో పాటు డాగ్ స్క్వాడ్ కు కాని పోలీసుల క్లూస్ టీమ్స్ కానీ తన ఆనవాళ్ళు దొర్కకుండా ఇంటి నిండా కారంపొడి చల్లి ఎస్కేప్ అయ్యడు. దోపిడీ సమాచారం అందుకున్న ఆంథోని మామయ్య తన తల్లితో కలిసి ఆంథీనితో పోలీలసులకు ఫిర్యాదు చేయించాడు.

సైంటిఫిక్ ఎవిడెన్స్....

ఇలా ఎవరీ కి అనుమానం రాకుండా తన ప్లాన్ ను పక్కా గా అమలు చేసిన అల్లుడు ఆంథోని....పోలీసులను కూడా తప్పుదోవ పట్టించాడు. ఐతే మొదటి నుండి ఆంథోని పై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు...చోరి జరిగిన ఇంటి నుండి ఎస్సార్ నగర్ తో పాటు ముషీరాబాద్ వరకు 70 సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించారు. ఐతే చోరి జరిగిన టైమ్ నుండి ఈ అన్ని సీసీ ఫుటేజ్ ల్లో ఆంథోని మూవ్ మెంట్స్ ఉండడంతో...దొంగ అల్లుడేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో అత్తమామలతో పాటు ఆంథోని భార్యను విచారించిన ఎస్సార్ నగర్ క్రైమ్ పోలీసులు....చివరకు హర్రీ ఆంథోనిని అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు. దీంతో అల్లుడి దొంగనాటకం బయటపడింది. ఈ కేసులో పూర్తిగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ను సేకరించిన పోలీసులు....ఆంథోనిని అరెస్ట్ చేసి లక్షా పదివేల నగదు 12 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చూసారుగా తన అత్తింటికే కన్నం వేసి తప్పించుకుందామనుకున్న దొంగల్లుడ్ని...సీసీ కెమెరాలు ఎలా పట్టించాయో. అందుకే ప్రతీ ఒక్కరు సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ తెలుసుకుని తమ ఇళ్ళతో పాటు కాలనీల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.

Similar News