చీదరించుకున్న జీవీఎల్

Update: 2018-10-25 11:06 GMT

ఛీ..ఛీ...ఇవేంపనులు అని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చీదరించుకున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్టులో దాడులు జరిగితే దానికి ఆపరేషన్ గరుడలో భాగమేనంటూ ప్రచారం సాగించడం సిగ్గుచేటన్నారు. ఇంతకంటే నీచమైన సంస్కృతి ఉంటుందా? అని జీవీఎల్ ప్రశ్నించారు. పిచ్చ పిచ్చ వేషాలు మానుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. జగన్ పై హత్యాయత్నం వెనుక కుట్ర ఉందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. విమర్శించే వారిపై దాడి చేసే సంస్కృతిని విడనాడాలన్నారు. లేకుంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. జగన్ పై దాడిని తాము ఖండిస్తే దానికి వేరే విషయాలను జోడించి ఆపాదిస్తారా? అని నిలదీశారు. నిజాయితీతో విచారణకు ఆదేశించాలన్నారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి వెంటనే దీనిపై స్పందించాలన్నారు. అచ్చోసిన ఆంబోతులను టీడీపీ పెంచి పోషిస్తుందన్నారు. వారిని కంట్రోలు చేయాలని టీడీపీ అగ్రనేతలకు జీవీఎల్ సూచించారు. హిట్లర్ పోకడలను విడనాడాలన్నారు.

Similar News