హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన హత్య కేసులో ..ఏ చిన్న క్లూ అందించినా ..లక్ష రూపాయల రివార్డ్ అందిస్తామని ప్రకటించారు..సైబరాబాద్ పోలీసులు. కొండాపూర్ బోటానికల్ గార్డెన్ వద్ద ముక్కలు ముక్కలుగా నరికి గోనె సంచిలో పడేసిన ఘటన కేసులో పోలీసులు ఎటువంటి పురోగతి సాధించలేక పోయారు. మృతురాలు ఎవరో కూడా ఇంకా గుర్తుపట్టలేదు. మృతురాలు గర్భిణి అని మాత్రం పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడయింది. మృతురాలికి 30 సంవత్సరాల వయస్సు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. తెలుపు రంగులో ఉంటుందని, మృతురాలి ఒంటిపై మెరూన్ రంగు కుర్తా, ఎరుపు రంగు పైజమా ఉందన్నారు. వేలికి రాగి ఉంగరం ఉంది. కాలికి వెండి మెట్టెలున్నాయి. మృతురాలు ఉత్తారాది రాష్ట్రానికి చెందిన మహిళగా పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. శరీరాన్ని ముక్కలుగా కోసి గోనె సంచిలో ప్యాక్ చేయడం, ప్యాక్ చేయడానికి ఉపయోగించిన వస్తువులను చూస్తుంటే హత్య చేసిన వ్యక్తి హోటల్, రెస్టారెంట్, హోల్ సేల్ కిరాణాషాపు, సూపర్ మార్కెట్ లో పనిచేసిన వ్యక్తి అయి ఉండవచ్చన్నది పోలీసుల అనుమానం. గుంటూరు జిల్లాకు చెందిన అంకుర్ బ్రాండ్ కారపు పొడి కవరు, అర్చన ఫ్లోర్ మిల్స్ అని ముద్రించి ఉన్న గోనెసంచి ఇప్పుడు పోలీసులకు కీలక ఆధారాలయ్యాయి. సమాచారాన్ని తెలిపిన వారికి లక్షరూపాయలు అందిస్తామని పోలీసులు చెప్పారు. సమాచారం అందించిన వారి పేరును కూడా గోప్యంగా ఉంచుతామన్నారు. పోన్ నెంబర్లు.. ఎస్సై నెంబరు 9491030375, సిఐ 9499617127, పోలీస్ స్టేషన్ గచ్చి బౌలి పీఎస్ 9491030378, ఏసిపి 9491039175, డీసీపీ 9490617201