కోర్టుల్లో రద్దయిన పాతనోట్లు

Update: 2016-12-28 23:30 GMT

న్యాయస్థానాల్లో రద్దయిన పాత పెద్దనోట్లున్నాయి. వాటిని ఏం చేయాలి? ఇప్పుడు న్యాయమూర్తులకు ఎదురవుతున్న ప్రశ్న ఇది. దేశంలో అన్ని న్యాయస్థానాల్లో లక్షల సంఖ్యలో ఐదు వందలు, వెయ్యి నోట్లున్నాయి. ఇవన్నీ ఏసీబీ దాడుల్లో చిక్కినవే. ఏసీబీ దాడులు చేసినప్పుడు వాటిపై పడ్డ వేలిముద్రల ఆధారంగా ఆ నోట్లను కోర్టులకు అప్పగిస్తుంది. ఆ కేసులో నోట్లే ప్రధాన సాక్ష్యాలు. అయితే ఏసీబీ కేసులు ఇంకా న్యాయస్థానాల్లో వేల సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయి. అందుకోసం ఏసీబీ దాడుల్లో చిక్కిన పెద్దనోట్లను న్యాయస్థానాలు భద్రపర్చాయి. ఇప్పుడు పెద్ద నోట్లు రద్దుకావడం, వాటిని మార్చేందుకు సమయం కూడా లేకపోవడంతో న్యాయమూర్తులు ఆలోచనలో పడ్డారు. సాక్షాలుగా ఉన్న వీటిని మారిస్తే కేసుల పరిష్కారం ఎలా అవుతుందన్నది వారి అనుమానం. అలాగని వాటిని అలానే ఉంచితే చెల్లకుండా పోతాయంటున్నారు. దీనిపై కొందరు న్యాయమూర్తులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా...ఇంతవరకు రెస్పాన్స్ లేదు. సుప్రీంకోర్టు కూడా దీనిపై ఎటువంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదు. కోర్టుల్లో ఉండే పాతనోట్లు ఇప్పడు ఏమవుతాయో మరి.

Similar News