కిమ్.. అనుకున్నంత పనీ చేశాడు...

Update: 2017-10-31 13:35 GMT

కిమ్ పూర్తిగా మతిస్థిమితం కోల్పోయాడు. 200 మంది ప్రాణాలను బలిగొన్నాడు. సెప్టంబరు 3వ తేదీన ఉత్తరకొరియా అణుపరీక్షలకు 200 మంది కార్మికులు బలయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జపాన్ కు చెందిన ఓ టీవీ ఛానల్ ఈ విషయాన్ని బయటపెట్టింది. పంగ్జేయే న్యూక్లియర్ టెస్ట్ వద్ద హైడ్రోజన్ బాంబు పరీక్షను ఈ ఏడాది సెప్టంబరు 3వ తేదీన ఉత్తర కొరియా నిర్వహించింది. ఈ హైడ్రోజన్ బాంబు పేలుడుకు ఒక సొరంగం కుప్పకూలి అందులో పనిచేస్తున్న 200 మంది కార్మికులు దుర్మరణం పాలయినట్లు జపాన్ టీవీ వెల్లడించింది. వంద కిలో టన్నులున్న ఈ హైడ్రోజన్ బాంబు 1945లో అమెరికా హీరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కంటే ఏడు రెట్లు శక్తివంతమైందని పేర్కొంది. అణుపరీక్షల కారణంగా పెద్దయెత్తున పర్యావరణ ముప్పు ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల చైనా సరిహద్దుల్లోని పర్వతాలు కూలిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరించినా కిమ్ లెక్క చేయలేదు. దీనిపై అంతర్జాతీయంగా పెద్దయెత్తున విమర్శలు విన్పిస్తున్నాయి.

Similar News