కన్నడిగులకు కాంగ్రెస్ పై కోపం రాదా?

Update: 2016-09-25 05:45 GMT

కావేరీ జలాల వివాదం అనేది తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పుట్టినప్పటినుంచి ఉన్న సమస్య. ఇప్పుడు ఆ సమస్య తార స్థాయికి చేరుకుంటున్నది. ఇరు రాష్ట్రాల సామాన్య ప్రజలు కూడా ఒకరినొకరు ద్వేషించుకునేలా పరిస్థితి తయారైంది. తమిళనాడుకు ఇవ్వడానికి సరిపడా కావేరీ జలాలు తమ వద్ద లేవంటూ.. కన్నడ సీఎం సిద్ధరామయ్య సభలో ఓ తీర్మానం చేసి అక్కడితో చేతులు దులుపుకున్నారు. ఆ రకంగా సుప్రీం తీర్పును అమలు చేయకుండా ఆగిపోయారు.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకుంటున్నది. పార్టీ ఢిల్లీ నేత కేటీఎస్ తులసీ ఈ విషయంలో మాట్లాడుతూ.. కర్ణాటక సీఎం తమవద్ద చెప్పినట్లుగా నీటి నిల్వలు లేవనే విషయాన్ని నిరూపించాల్సి ఉంటుందని అంటున్నారు. అయినా.. ఆ మాటకొస్తే.. కన్నడ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు మాట్లాడిస్తున్నదో అర్థం కావడం లేదు. అలా చేసినం మాత్రాన వారినేమీ తమిళ ప్రజలు ఆదరించబోయేది లేదు.

పైగా దక్షిణాది రాష్ట్రాలన్నిటిలోకి కన్నడసీమలో మాత్రమే వారిచేతిలో ఉన్న అధికారం కూడా కావేరి పుణ్యమా అని మట్టిగొట్టుకుపోయే ప్రమాదం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.

Similar News