ఎర్రబస్సా? ఎయిర్ బస్సా?

Update: 2017-02-28 08:30 GMT

పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు విమానంలో సామర్థ్యానికి మించి ఏడుగురు ప్రయాణికులను ఎక్కించి నిలబడి ప్రయాణం చేసిన ఘటనపై పాక్‌ సివిల్‌ ఏవియేషన్‌ అధికారులు విచారణ చేపట్టారు. విమాన పైలట్‌కు, మరో ఇద్దరు అధికారులకు పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌ షోకాజ్‌ నోటీసులు పంపించింది. కరాచీ నుంచి మదీనా వెళ్తున్న విమానంలో ఏడుగురు ప్రయాణికులు నిలబడి ప్రయాణించిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ప్రయాణికులను అలా తీసుకెళ్లడం భద్రతకు చాలా ప్రమాదమని పలువురు ఆందోళన వ్యక్తంచేశారు.

ఎయిర్ లైన్స్ కు నోటీసులు జారీ

ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్‌ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌ అధికార ప్రతినిధి డేన్‌యల్‌ గిలానీ తెలిపారు. కెప్టెన్‌ అన్వర్‌ ఆదిల్‌, సీనియర్‌ ఎయిర్‌హోస్టెస్‌ హీనా తురబ్‌, టెర్మినల్‌ మేనేజర్‌ అక్బర్‌ అలీ షాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. జనవరి 20న కరాచీ నుంచి మదీనా వెళ్లిన విమాన సామర్థ్యం జంప్‌ సీట్లతో కలిపి 409 కాగా సిబ్బంది 416 మందిని ఎక్కించారు.

Similar News