ఎమ్మెల్సీకి రెండేళ్లు జైలు

Update: 2018-01-13 06:09 GMT

పోలీసులపై దాడి చేసిన కేసులో ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డికి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ గూడూరు అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు చెప్పింది. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డితో పాటు మరో పదిమందికి జైలు శిక్షతో పాటు 4,700 రూపాయల జరిమానా విధించింది. 2011లో విద్యుత్ పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న సమయంలో శ్రీనివాసులు రెడ్డితో పాటు మరికొంతమంది విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్నారు. అప్పట్లోనే వీరిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు రెడ్డితో పాటు మరో పది మందికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.

Similar News