అసెంబ్లీలో ఫీజు పోరు

Update: 2017-01-05 09:14 GMT

ఫీజు రీఎంబర్స్ మెంట్ పై గురువారం అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఫీజు రీఎంబర్స్ మెంట్ పై చర్చించాల్సిందేనని విపక్షాలు, ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిన తర్వాత చర్చిద్దామని ప్రభుత్వం అనడంతో కొద్దిసేపు సభలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విపక్షాలైన కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం సభ్యులు వాకౌట్ చేశాయి. విద్యార్ధులను కేసీఆర్ మభ్య పెడుతున్నారని విపక్ష సభ్యులు ఆరోపించారు. ఏపీ కళాశాలల్లో సీట్లు వచ్చిన వారికి ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ నిలిపేసిందని విమర్శించారు. జనవరి వరకూ ఉన్న బకాయీలను తక్షణమే విడుదల చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. అయితే ఈ పథకాన్ని పొందాలంటే విద్యార్థులకు కళాశాలల్లో 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలన్నారు. అలాగే పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్న కేసీఆర్ పథకం ప్రారంభమైన నాటి నుంచే బాకాయీలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏ ఏడాది కాఏడాది నిధులు కేటాయించాలంటే కుదరదని కేసీఆర్ కుండబద్దలు కొట్టేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 20 లక్షల మందికి స్కాలర్ షిప్ లు ఇస్తున్న విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిధులు కళాశాలల యాజమాన్యం దుర్వినియోగం చేయకూడదనే కొన్ని విధానాలను అమలు పరుస్తున్నామాన్నారు.

Similar News