అసెంబ్లీనా ...మయసభనా....?

Update: 2017-03-16 09:30 GMT

ఏపీ నూతన అసెంబ్లీలో ఎవరి కార్యాలయం ఎక్కడుందో తెలుసుకోడానికి మంత్రులు., ఎమ్మెల్యేలు సైతం తిప్పలు పడుతున్నారు. వెలగపూడిలో సమావేశాలు ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా శాసనసభ., మండలి కార్యాలయాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు నేతలు తిప్పలు పడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కొత్త అసెంబ్లీ భవనం ఇంకా అలవాటు కాకపోవడంతో ఈ సమస్య వచ్చింది. మంత్రుల ఛాంబర్లు..., శాసన సభా పక్ష కార్యాలయాలు, సభ మందిరం ప్రవేశ ద్వారాల విషయంలో సభ్యుల్లో గందరగోళం నెలకొంది.

మంత్రి కామినేని గురువారం శాసన మండలికి దారి వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఇదంతా మయసభ లాగా ఉందంటూ కామినేని చమత్కరించారు. దారిలో కనిపించిన వారిని అడుగుతూ బతుకుజీవుడా అనుకుని మండలిలోకి అడుగుపెట్టారు. ఇక ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు డిప్యూటీ సీఎం ఛాంబర్ నుంచి నేరుగా మండలిలోకి వెళ్లబోయి వెనక్కు వచ్చేశారు. ఇదే గందరగోళంతో శాసనసభకు బదులు., మండలికి వెళ్లి మంత్రి కొల్లు రవీంద్ర వెనుదిరిగి వచ్చారు.

Similar News