అది తమిళనాడు స్పెషాలిటీ అదేనండీ

Update: 2017-07-19 02:28 GMT

అక్కడ కత్తులు దూసుకోవడం....రాజకీయ ప్రత్యర్ధుల్ని ముప్పతిప్పలు పెట్టడం., కక్ష సాధింపులు ఓ రేంజ్‌లో ఉంటాయి. అదే సమయంలో సొంత రాష్ట్ర ప్రయోజనాల విషయమైనా., తమ జాతి ప్రజల ఆత్మగౌరవమైనా ఏకమైపోతాయి. అదే అక్కడి ప్రజలు., పార్టీల గొప్పతనం. తమిళనాడు 50ఏళ్ల క్రితం శాసనభలో జరిగిన ఏకగ్రీవ అమోదం మళ్లీ ఆవిష్క్రతమైంది. డిఎంకే అధ్యక్షుడు కరుణానిధి వయసు., ఆరోగ్య సమస్యల వల్ల 15వ శాసన సభకు హాజరు కాలేకపోతున్నారని ప్రతిపక్ష డిఎంకే నేత స్టాలిన్‌ తీర్మానం ప్రవేశపెట్టారు.దీనిని అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా అమోదించాయి. కరుణను తీవ్రంగా వ్యతిరేకించే అధికార ఏఐడిఎంకే సైతం ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. 1967 జులై18 తర్వాత ఇలాంటి ఏకగ్రీవ ఘట్టం 50ఏళ్ల తర్వాత జరిగింది. అప్పట్లో మద్రాసు రాష్ట్రంగా ఉన్న పేరును తమిళనాడుగా మార్చాలని నాలుగో శాసనసభలో ముఖ్యమంత్రి అన్నాదురై ప్రవేశపెట్టారు. నాటి ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా ఆ తీర్మానానికి మద్దతిచ్చింది. ఇప్పుడు మళ్లీ 50ఏళ్ల తర్వాత అదే రోజు ఏకగ్రీవ తీర్మానానికి అమోదం లభించడం విశేషం.

Similar News