అక్రమ నిర్మాణాలను ఉపేక్షించం

Update: 2017-02-02 20:30 GMT

రాజధాని ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై దృష్టిపెట్టాలని, వీటి నియంత్రణకు ప్రత్యేక బృందాన్ని నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గేలా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని సూచించారు.

అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగులకు 3,165 వరకు నివాస సముదాయాల నిర్మాణం, ఇంకా విభాగాధిపతుల కార్యాలయాల నిర్మాణానికి రూ. 4,750 కోట్లు వ్యయం కానుందని ఇందుకు సంబంధించి అంచనాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. ‘మెట్రో’ పనులకు ముందే ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధి విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో రైలు పనులు చేపట్టడానికి ముందే ప్రత్యామ్నాయ రహదారులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. విజయవాడ సుందరీకరణపైనా సమీక్షలో చర్చించారు. పవిత్రసంగమం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజధానికి దారితీసే అన్ని ముఖద్వారాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దాలన్నారు.

Similar News