అందుకోండి నా అభినందనలు

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన విజయానికి ప్రవాసాంధ్రులు కూడా కారణమని వైెఎస్ జగన్ తెలిపారు. నార్త్ అమెరికాలోని తెలగువారిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. తన విజయంలో ప్రవాసాంధ్రలు [more]

Update: 2019-08-18 04:20 GMT

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన విజయానికి ప్రవాసాంధ్రులు కూడా కారణమని వైెఎస్ జగన్ తెలిపారు. నార్త్ అమెరికాలోని తెలగువారిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. తన విజయంలో ప్రవాసాంధ్రలు పాత్రకూడా ఉందని జగన్ తెలిపారు. వారికి తాను నిండు మనసుతో అభినందనలు తెలుపుతున్నారు. తాను 151 ఎమ్మెల్యే స్థానాలు, 22 పార్లమెంటు నియోజకవర్గాలను గెలుచుకున్నానంటే ఏపీ ప్రజల దీవెనతో పాటు అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారి అండదండలు కూడా కారణమన్నారు జగన్

పరిశ్రమల స్థాపనకు….

ఆంధ్రప్రదేశ్ ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రెండు నెలల్లోనే కఠిన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. పారిశ్రామిక వేత్తలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ఏపీలో పరిశ్రమలు స్థాపనకు ముందుకు రావాలని, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని జగన్ ప్రవాసాంధ్రులను కోరారు.

Tags:    

Similar News