అమూల్ పాలవెల్లువ పైలెట్ ప్రాజెక్టు ప్రారంభం

అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. నేట ినుంచి ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాలోని నాలుగు వందల [more]

Update: 2020-12-02 08:32 GMT

అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. నేట ినుంచి ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాలోని నాలుగు వందల గ్రామాల్లో అమూల్ సంస్థ రైతుల నుంచి పాలను నేటి నుంచి సేకరిస్తుందన్నారు. పాలను సేకరించిన పది రోజుల్లోగా రైతుల ఖాతాల్లోకి సొమ్మును అమూల్ సంస్థ జమ చేస్తుందని జగన్ తెలిపారు. ఇందులో దళారీలు ఎవరూ ఉండరన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకూ సేకరిస్తున్న దానికంటే ఐదురూపాయలు ఎక్కువగానే లీటరుకు అమూల్ కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఇది రాష్ట్రంలో మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. దీంతో పాటు ఆవుల, గేదెల పంపిణీని కూడా చేస్తామని జగన్ చెప్పారు.

Tags:    

Similar News