జగన్ ఆస్తుల కేసు నేడు కోర్టులో

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నేడు సీబీఐ కోర్ట్ లో విచారణ జరిగింది. గత విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా [more]

Update: 2020-10-12 07:14 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నేడు సీబీఐ కోర్ట్ లో విచారణ జరిగింది. గత విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని జగన్ తరపు న్యాయవాది కోరారు. జగన్ కు సంబంధించిన నాలుగు కేసుల స్టే లు విషయంపై న్యాయస్థానం దూకుడు పెంచింది. హెటిరో, అరబిందోలకు భూకేటాయింపులు, జగతిలో పెట్టుబడులు, పెన్నాఇండియా, దాల్మియా, భారతి సిమెంట్స్‌కు లీజులు, అరబిందో, హెటిరో సంస్థలకు క్విడ్‌ ప్రొ కో పై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఇందూగ్రూపు, వాన్‌పిక్‌కు భూకేటాయింపులుపై 11 కేసులను సీబీఐ నమోదు చేసింది. అన్నింటిని కలిపి విచారణ జరపనుంది.

Tags:    

Similar News