బ్రేకింగ్ : పోతిరెడ్డి పాడు ఎవరికీ నష్టం కాదు.. కష్టం కాదు

పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుపై జగన్ మరోసారి స్పందించారు. పోలవరం ప్రాజెక్టు కరోనా వల్ల కొంత పనుల్లో జాప్యం జరిగినా 2021 కల్లా పూర్తి చేస్తామని వైఎస్ జగన్ [more]

Update: 2020-05-26 08:18 GMT

పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుపై జగన్ మరోసారి స్పందించారు. పోలవరం ప్రాజెక్టు కరోనా వల్ల కొంత పనుల్లో జాప్యం జరిగినా 2021 కల్లా పూర్తి చేస్తామని వైఎస్ జగన్ తెలిపారు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. రాయలసీమకు నీరందిచేందుకు పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్థ్యాన్ని కూడా పెంచుతామన్నారు. శ్రీశైలంలో 881 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడుకు నీళ్లను తీసుకోగలుగుతామని చెప్పారు. 851 క్యూసెక్కులు ఉంటే 7 వేల క్యూసెక్కులు మాత్రమే డ్రా చేయగలుగుతామని చెప్పారు. వరద వచ్చే సమయం కేవలం పదిరోజులు మాత్రమే ఉంటుందన్నారు. తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు 800 అడుగులు ఉన్నాయన్నారు. రాయలసీమకు నీళ్లు రావాలంటే పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతున్నామని చెప్పారు. ఏపీికి కేటాయించిన నీటినే వాడుకుంటామని చెప్పారు. ఎవరికీ కష్టం, నష్టం కల్గించమని జగన్ తెలిపారు. దీనివల్ల రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీరందిస్తామని చెప్పారు. వ్యవసాయంపై ఆయన రివ్యూ చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News