ఎల్సీ పాలిమర్స్ కు తాము ఎటువంటి అనుమతులివ్వలేదు

గ్యాస్ లీక్ ఘటనలు జరగకుండా అన్ని జగ్రత్తలు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గ్యాస్ లీక్ బాధితులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. [more]

Update: 2020-05-18 07:54 GMT

గ్యాస్ లీక్ ఘటనలు జరగకుండా అన్ని జగ్రత్తలు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గ్యాస్ లీక్ బాధితులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. దేశ చరిత్రలో ఎవరూ ఇవ్వని విధంగా కోటి రూపాయల పరిహారం ఇచ్చామని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. ఎల్జీ పాలిమర్స్ బాధితులందరికీ ప్రభుత్వం సాయం అందించామన్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకే కమిటీని నియమించామని చెప్పారు. కమిటీల నివేదిక వచ్చిన తర్వాత కారణాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్జీ పాలిమర్స్ కు తమ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, ఆ కంపెనీకి ఇచ్చిన అనుమతులన్నీ చంద్రబాబు ఇచ్చినవేనని జగన్ తెలిపారు. రాజకీయాలు చేయకుండా మానవత్వం ప్రదర్శించామన్నారు. తప్పు జరిగినట్లు తేలితే ఎవరినీ వదలబోమన్నారు. ఎంతటి వారిపైనానా చర్యలు తీసుకుంటామని జగన్ చెప్పారు.

Tags:    

Similar News