సినిమాహాళ్లు, రెస్టారెంట్లు ఓపెన్ చేయాలని?

ఆంధ్రప్రదేశ్ లో సినిమా హాళ్లు, రెస్టారెంట్లు ప్రారంభించేందుకు జగన్ ప్రభుత్వం రెడీ అయింది. వీటిని ఎలా తెరిస్తే బాగుంటున్న దానిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జగన్ [more]

Update: 2020-05-15 02:12 GMT

ఆంధ్రప్రదేశ్ లో సినిమా హాళ్లు, రెస్టారెంట్లు ప్రారంభించేందుకు జగన్ ప్రభుత్వం రెడీ అయింది. వీటిని ఎలా తెరిస్తే బాగుంటున్న దానిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఈ రెండు వ్యాపారాల వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ ఆదాయం వస్తుంది. అయితే ఎక్కువగా గుమికూడే ప్రదేశాలు కూడా ఇవే కావడంతో ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలోనూ వీటికి అనుమతి ఇవ్వలేదు. పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తర్వాత ఎలాంటి షరతులతో వీటిని ఓపెన్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రారంభించినా ప్రజలు వీటికి వచ్చేందుకు సిద్ధమవుతారన్నదీ ప్రశ్నే. లాక్ డౌన్ ఎగ్జిట్ ప్లాన్ లో భాగంగా ఈ రెండింటిపై తనకు నివేదిక ఇవ్వాలని జగన్ కోరారు. నివేదిక వచ్చిన తర్వాత సంతృప్తి చెందితేనే వీటిని తెరిచే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News