ఆలస్యం చేయకండి… వెంటనే రంగంలోకి దిగండి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అత్యవసరంగా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కరోనా వైరస్ ఏపీలో విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆయన దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏపీలో ఇప్పటికే 161 కరోనా [more]

Update: 2020-04-03 07:08 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అత్యవసరంగా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కరోనా వైరస్ ఏపీలో విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆయన దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏపీలో ఇప్పటికే 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 140 వరకూ జమాతే కు వెళ్లివచ్చిన వారే కావడంతో జగన్ అధికారులతో దీనిపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి మర్కజ్ కు వెళ్లిన వారిలో 108 మందికి పాజిటివ్ రావడంతో వారి కుటుంబ సభ్యులకు 613 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని జగన్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో మరో రెండు ల్యాబ్ ల ఏర్పాటుకు అనుమతిచ్చింది. వీటిని గుంటూరు, కడప జిల్లాల్లో పెట్టాలని జగన్ నిర్ణయించారు.

Tags:    

Similar News