జగన్ సర్కార్ కీలక నిర్ణయం…ప్రయివేటు ఆసుపత్రులన్నీ?

ఏపీలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ముఖ్యంగా కాంటాక్ట్ కేసులు ఎక్కువగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. విశాఖ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]

Update: 2020-03-30 04:24 GMT

ఏపీలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ముఖ్యంగా కాంటాక్ట్ కేసులు ఎక్కువగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. విశాఖ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు జగన్ కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను కాసేపట్లో నిర్వహించనున్నారు. ముఖ్యంగా కరోనా అనుమానితులను గుర్తించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశించనునున్నారు.

కృష్ణలంకలో హై అలెర్ట్…..

తాజాగా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయివేటు ఆసుపత్రుల నిర్వహణ, వైద్య సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలు, ఇన్ పేషెంట్ సేవలు మొత్తం ప్రభుత్వ ఆదీనంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. కరోనా విపత్తు నేపథ్యంలో అన్ని వైద్య విభాగాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో కరోనా పాజిటివ్ నమోదు కావడంతో అక్కడ హై అలెర్ట్ ప్రకటించారు. ఈరోజు 16, 17, 18, 20, 21, 22 డివిజన్లలో పూర్తిగా లాక్ డౌన్ ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ డివిజన్లలోని ప్రజలు ఎవరూ ఈరోజు బయటకు రావద్దని కలెక్టర్ ఇంతియాజ్ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News