కరోనాపై జగన్ ఉన్నతస్థాయిలో?

కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఏపీలో 19 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఏపీలో [more]

Update: 2020-03-29 07:24 GMT

కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఏపీలో 19 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఏపీలో మొత్తం 512 మందికి పరీక్షలు నిర్వహించగా 433 మందికి నెగిటెవ్ రిపోర్ట్ వచ్చింది. 60 మందికి సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్ కరోనాపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. లాక్ డౌన్, రేషన్ తో పాటు కరోనాపై ఈ సమావేశంలో చర్చించారు. వలస కూలీలు, పేదలకు సాయం అందించడంపై చర్చించారు. మరో ఐదు రోజుల పాటు రేషన్ పంపిణీ కొనసాగించాలని నిర్ణయించారు. విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్ లో ఉన్నందున వారిపై నిఘాను మరింత పెంచాలని భావించారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు అధికారులు పాల్గొన్నారు. అయితే ఈరోజు ఇంతవరకూ కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News