మంత్రులకు క్లాస్ పీకిన జగన్

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అమరావతి ఇన్ సైడింగ్ ట్రేడింగ్ విషయంలో జరిగిన అవినీతిపై ఛార్జి షీటు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి 25న ఉగాది [more]

Update: 2020-03-04 09:00 GMT

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అమరావతి ఇన్ సైడింగ్ ట్రేడింగ్ విషయంలో జరిగిన అవినీతిపై ఛార్జి షీటు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి 25న ఉగాది సందర్భంగా పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఐదేళ్ల తర్వాత వాళ్లు విక్రయించుకునేలా కూడా నిబందనలను మార్చనున్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసం 29,970 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. మరోవైపు జగన్ కూడా మంత్రులకు సీరియస్ గానే క్లాస్ పీికినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఉపేక్షిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీలో అధికార పార్టీ నేతలను కూడా ఉపేక్షించబోమన్నారు. ఒకట్రెండు రోజుల్లో రిజర్వేషన్లపై నిర్ణయం వెలువడుతుందన్నారు.

Tags:    

Similar News