2021 నాటికి పోలవరం పూర్తి చేయాల్సిందే

2021కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు జారీచేశారు. వర్షాకాలంలో నది ప్రవహించే సమయంలో కూడా అంటే జూన్‌ నుంచి అక్టోబరు వరకూ కూడా [more]

Update: 2020-02-28 13:17 GMT

2021కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు జారీచేశారు. వర్షాకాలంలో నది ప్రవహించే సమయంలో కూడా అంటే జూన్‌ నుంచి అక్టోబరు వరకూ కూడా పనుల జరిగేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయాలని అధికారులకు స్పష్టంచేశారు. ఈ మేరకు ప్రాధాన్యతా క్రమంలో పనులు చేయాలన్నారు. ఈ ఏడాది జూన్‌ నాటికి స్పిల్‌వే సంబంధిత పనులు పూర్తిచేయాలని, ఆ తర్వాత కాపర్‌ డ్యాంలో ఇప్పుడున్న ఖాళీలను పూర్తిచేయాలని, నదీ ప్రవాహం స్పిల్‌వే మీదుగా మళ్లించి ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాంను పూర్తిచేయాలని ఆదేశించారు. ఇప్పటినుంచే సహాయ పునరావాస కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్టులో పనుల పురోగతిని సీఎంజగన్‌ స్వయంగా పరిశీలించారు.

Tags:    

Similar News