జగన్ ను కలిశారు పని వెంటనే అయిపోయింది

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిస్తే చాలనుకుంటారు చాలామంది. తమ సమస్యలను చెప్పుకుంటే వెంటనే పనిఅయిపోతుందని భావిస్తారు. అలాగే పోలవరం ముంపు ప్రాంతాలకు చెందిన పదిహేను కుటుంబాలు [more]

Update: 2020-02-28 07:35 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిస్తే చాలనుకుంటారు చాలామంది. తమ సమస్యలను చెప్పుకుంటే వెంటనే పనిఅయిపోతుందని భావిస్తారు. అలాగే పోలవరం ముంపు ప్రాంతాలకు చెందిన పదిహేను కుటుంబాలు జగన్ ను కలిసేందుకు ఎంతగానో ప్రయత్నించాయి. అయితే వారికి వీలు పడలేదు. తాడేపల్లి వచ్చినా కుదరలేదు. స్పందన కార్యక్రమంలోనూ వారికి అవకాశం దక్కలేదు. దీంతో కొద్దిసేపటి క్రితం పోలవరం వచ్చిన జగన్ ను కలుద్దామని వారు ప్రాజెక్టు వద్దకు వచ్చారు.

పదిహేను కుటుంబాలను….

అయితే పోలీసులు వారిని జగన్ వద్దకు ఎందుకు పంపుతారు? నిరాశతో అక్కడే వేచి ఉన్నారు. వారి అదృష్టమేమో కాని జగన్ దృష్టిలో వారు పడనే పడ్డారు. వెళ్తున్న కాన్వాయ్ ను ఆపి మరీ వారిని దగ్గరకు పిలిపించుకున్నారు. తాము పోలవరం నిర్వాసితులమని, తమకు నష్ట పరిహారం అందలేదని జగన్ కు తమ గోడును వినిపించుకున్నారు. వినతి పత్రాలను అందచేశారు. జగన్ వెంటనే ఆ పదిహేను కుటుంబాలను పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో చేర్చాలని జగన్ ఆదేశించారు. ఇప్పటి వరకూ వారి పేర్లను ఎందుకు చేర్చలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News