సీరియస్ గానే చెబుతున్నా

వెలిగొండ ప్రాజెక్టు ఐదేళ్లుగా ఎందుకు సక్రమంగా జరగడం లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. గత రెండేళ్లుగా మరింతగా పనులు స్లోగా నడుస్తుండటానికి కారణాలను అడిగి [more]

Update: 2020-02-20 12:43 GMT

వెలిగొండ ప్రాజెక్టు ఐదేళ్లుగా ఎందుకు సక్రమంగా జరగడం లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. గత రెండేళ్లుగా మరింతగా పనులు స్లోగా నడుస్తుండటానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన జగన్ అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల్లో ఆలస్యం జరిగితే ఊరుకోనని హెచ్చరించారు. చెప్పిన సమయానికి ప్రాజెక్టు పూర్తికావాల్సిందేనన్నారు. అంతేకాదు పనులు చేయకపోతే రివర్స్ టెండర్ ద్వారా వేరే సంస్థకు పనులు అప్పగించాలని కూడా జగన్ సూచించారు. ఆగస్టు కల్లా మొదటి ఆయకట్టుకు నీళ్లివ్వాలని ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందనుండటంతో ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. టన్నెల్ 2 ను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు.

Tags:    

Similar News