జగన్ మరో పథకానికి

సున్నా వడ్డీకే రుణాలను ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. నన్నయ యూనివర్సిటీలో దిశ యాప్ ప్రారంభించిన జగన్ బహిరంగ సభలో [more]

Update: 2020-02-08 08:03 GMT

సున్నా వడ్డీకే రుణాలను ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. నన్నయ యూనివర్సిటీలో దిశ యాప్ ప్రారంభించిన జగన్ బహిరంగ సభలో మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని జగన్ గుర్తు చేశారు. అమ్మఒడి ద్వారా 42 లక్షల మంది తల్లులు లబ్ది పొందారన్నారు. ప్రతి అడుగులోనూ మహిళలకు అండగా ఉంటానని చెప్పారు. వ్యవస్థలో మార్పు తెచ్చేందుకే దిశ చట్టాన్ని తెచ్చామన్నారు. ఉగాది నాటికి 25 లక్షల మంది పేద మహిళలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మహిళలు ఏపీలో తలెత్తుకుని తిరిగేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జగన్ వివరించారు. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. త్వరలోనే సున్నా వడ్డీకే రుణాలు ఇస్తున్నట్లు జగన్ ప్రకటించారు. టోల్ గేట్ వద్ద జరిగిన దిశ ఘటన తనను కలిచి వేసిందన్నారు. మనుషులు రాక్షసులవుతున్న వేళ నేరాలు జరుగుతున్నాయన్నారు. అందుకోసమే మద్యనిషేధాన్ని ఏపీలో దశలవారీగా అమలు పరుస్తున్నామని చెప్పారు.

Tags:    

Similar News