కరోనా వ్యాప్తి.. అప్రమత్తమయిన జగన్ సర్కార్

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో జగన్ ప్రభుత్వం అప్రమత్తమయింది. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో కోవిడ్ [more]

Update: 2021-03-19 01:00 GMT

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో జగన్ ప్రభుత్వం అప్రమత్తమయింది. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో కోవిడ్ నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. రెండో దశ వ్యాప్తి జరుగుతున్నందున వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీలయినంత మేర వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని పరిశ్రమలను కోరింది. ఎప్పటికప్పుడు పరిశ్రమల్లో శానిటైజేషన్ చేేయాలని కోరింది. హోటళ్లు, రెస్టారెంట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ప్రతిచోటా ధర్మల్ స్కానింగ్ చేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News