ప్రధానికి జగన్ లేఖ.. ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని [more]

Update: 2021-02-07 02:08 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని జగన్ తన లేఖలో కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటు పరం చేయవద్దని, అది ఆంధ్రుల సెంటిమెంట్ అని జగన్ తన లేఖలో పేర్కొన్నరాు. సంస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ను తన ప్రభుత్వం కాపాడుకుంటుందని జగన్ లేఖలో ప్రధానికి వివరించారు.

విశాఖ ఉక్కుపై ప్రధానికి జగన్ లేఖలో ఏం రాశారంటే?

1. సొంతానికి గనులు కేటాయించండి. అధిక ధరకు ముడిసరుకు కొనే భారం తగ్గుతుంది.
2. అధిక వడ్డీలతో ఉన్న బ్యాంకు ఋణాలు పెట్టుబడి వాటాలుగా మార్చండి. వడ్డీ, అప్పు భారం తగ్గుతుంది.
3. ఉత్పత్తి సామర్ధ్యం పెరిగింది. అదే తీరు కొనసాగించండి.
4. నెలకు రూ 200 కోట్ల లాభాల స్థాయికి వచ్చింది. మరో రెండేళ్ళు ఇలాగే కొనసాగిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది.
5. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదంతో, 32 మంది ప్రాణత్యాగంతో పరిశ్రమ ఏర్పాటయింది. ఆ త్యాగాలను గౌరవించండి.
6. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల ప్రతిష్టకు గుర్తు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. కొనసాగించండి

Tags:    

Similar News