షాతో జగన్… చర్చించిన అంశాలివే

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై జగన్ అమిత్ షా తో చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన [more]

Update: 2020-02-15 01:43 GMT

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై జగన్ అమిత్ షా తో చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపై షాకు జగన్ వినతి పత్రాన్ని అందించారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఇప్పటివరకూ రూ.838 కోట్లను ఆదాచేయగలిగామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వేగంగా నిర్మాణం జరుగుతుందని చెప్పారు. పోలవరం రివైజ్డ్ అంచనాలను 55,5499 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేయాలని అమిత్ షాను జగన్ కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన 3,320కోట్లను విడుదల చేయాల్సిందిగా కోరారు.

హోదా విషయంలో…..

రాజధాని నిర్మాణంకోసం రూ.2500 కోట్లు కేటాయిస్తే, ఇప్పటివరకూ రూ.1000 కోట్లు మాత్రమే ఇచ్చారని, మిగిలిన డబ్బును విడుదల చేయాల్సిందిగా హోంమంత్రిని జగన్ కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశాన్ని 15వ ఆర్థిక సంఘం తన మధ్యంతర నివేదికలో ప్రస్తావిస్తూ… ‘‘ కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుతున్నాయని, ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్ధిక సంఘం సిఫార్సులతో అవసరం లేదని, ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, తగిన నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వమే తీసుకోవచ్చంటూ 15వ ఆర్థిక సంఘం స్పష్టంచేసిన అంశాన్ని కూడా జగన్ హోంమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

మూడు రాజధానులు…..

రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రికి జగన్ తెలిపారు.దీనికోసం రాజధాని కార్యకలాపాలను మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించామని, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడిషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ గా అమరావతిగా ప్రణాళిక వేసుకున్నామని, ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. హైకోర్టును కర్నూలు తరలించడానికి కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని అమిత్‌షాను జగన్ కోరారు.

మండలి రద్దు విషయంలో….

శాసనమండలి రద్దు అంశాన్ని కూడా విజ్ఞాపనపత్రంలో పేర్కొన్నారు. గడచిన రెండు నెలల పరిణామాలను చూస్తే శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో, పక్షపాతంతో వ్యవహరిస్తోందని షాకు జగన్ వివరంచారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నంచేసి అపహాస్యం చేసిందన్నారన్నారు. శాసనమండలి రద్దు పై తదనంతర చర్యలకోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని అమిత్‌షాకు విజ్ఞప్తి
చేశారు. దిశ చట్టాన్ని కూడా ఆమోదించాలని కోరారు.

Tags:    

Similar News