నాకు శత్రువులు ఎక్కువ…టాార్గెట్ చేశారు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యారంగంలో నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒంగోలులో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేకపోతే పిల్లల [more]

Update: 2019-11-14 06:56 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యారంగంలో నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒంగోలులో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేకపోతే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోలేమన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోటీ తత్వం పెరుగుతుంటే పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అవసరం లేదా? అని జగన్ ప్రశ్నించారు. రాష‌్ట్రంలో 33 శాతం చదువుకోలేని వారున్నారన్నారు. మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నారు. పేదపిల్లలకు అండగా నిలవడమా? వారి తలరాతలు ఇంతేనని వదిలేయాలా? అన్నది అందరూ ఆలోచించుకోవాలన్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకుంటే పేద పిల్లల భవిష్యత్తును మనమే కాలరాసినట్లవుతుందన్నారు జగన్. ఇంగ్లీష్ తో పాటు తెలుగు కూడా ఉంటుందని జగన్ చెప్పారు. ఎంతమంది నన్ను టార్గెట్ చేసినా పిల్లల భవిష్యత్ కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. తనకు శత్రువులు కూడా ఎక్కవగా ఉన్నారన్నారు జగన్.

ఛాలెంజ్ లను అధిగమించి….

ప్రపంచంలో ఎక్కడైనా బతికేందుకు…పోటీలో నిలిచేందుకు చదివించాలా? లేక వారిని అలాగే వదిలేయాలా? అని నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. రాజకీయ నాయకుడి దగ్గర నుంచి సినీనటుడు వరకూ ఎవరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం లేదన్నారు. మార్పు సరైన సమయంలో రావాలన్నారు జగన్. పేదవాడు తెలుగుమీడియంలోనే చదవాలని వదిలేస్తే… ఎవరు నష్టపోతారని జగన్ ప్రశ్నించారు. విపక్షాలు నిజాయితీగా ఆలోచన చేయాలని జగన్ కోరారు. తన పాదయాత్రలో అడుగడుగునా ప్రతి తల్లిదండ్రులూ తన పిల్లలకు నాణ్యమైన చదువు చదవించాలని చెప్పారు. అందుకే చరిత్రను మార్చబోయే తొలి అడుగులు నేడు వేస్తున్నానని జగన్ చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మూడు దశల్లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు. మరుగుదొడ్లు, ఫ్యాన్లు, ఫర్నీచర్ తో సహా అన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అదనపు తరగతులను నిర్మిస్తామన్నారు. మంచి మనసుతో ముందడుగు వేస్తే నిధులు వాటంతట అవే వస్తాయన్నారు. ప్రతి అడుగులోనూ ఛాలెంజ్ ఉంటుందని, వాటిని అధిగమిస్తామని చెప్పారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా అధిగమిస్తానని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News