రాజ్యాంగం ప్రకారం కాకున్నా…?

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 34 శాతం అధికారికంగా మించకపోవడంతో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ తరుపున బీసీలకు పదిశాతం అదనంగా సీట్లు [more]

Update: 2020-03-08 02:11 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 34 శాతం అధికారికంగా మించకపోవడంతో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ తరుపున బీసీలకు పదిశాతం అదనంగా సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో 34 శాతం బీసీ అభ్యర్థులు వైసీపీ తరుపున పోటీ చేసే వారిలో ఉండాలని పార్టీ అధినేతగా ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల తమ పార్టీ బీసీలకు అన్యాయం చేయడం లేదని, రిజర్వేషన్లు లేకపోయినా వారికి పదవుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తున్నామన్న సంకేతలు పంపారు. పదిశాతం అదనంగా బీఫామ్ లు ఇస్తే వైసీపీ తరుపున 34 శాతం బీసీలకు పదవులు లభించినట్లే అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసే వారిలో 34 శాతం బీసీ అభ్యర్థులు ఉండబోతున్నారు.

Tags:    

Similar News