నేతన్న నేస్తం పథకం ప్రారంభం

వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జగన్ పర్యటించారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి [more]

Update: 2019-12-21 07:43 GMT

వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జగన్ పర్యటించారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి 24 వేల రూపాయాలను ఇవ్వనున్నారు. నేరుగా నేతన్నల ఖాతాలోనే నగదును బదిలీ చేస్తారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ ధర్మవరం నేతన్న ల గురించి తనకు తప్ప మరెవరికీ పెద్దగా తెలియకపోవచ్చన్నారు. పులివెందుల నియోజకవర్గానికి పక్కనే ఉండటం వల్ల ధర్మవరం నేతన్నల పరిస్థితి తనకు తెలుసునన్నారు. జనవరి 9వ తేదీన అమ్మవడిని ప్రారంభిస్తామన్నారు. ప్రతి అడుగులోనూ వివక్ష లేకుండా చూస్తున్నామన్నారు. ఎందరు తనకు శత్రువులు ఉన్నా మీ ఆశీస్సులే తన బలమని ప్రజలనుద్దేశించి అన్నారు.

Tags:    

Similar News