కేసీఆర్ ఆ హామీ ఇచ్చిన తర్వాతే జగన్?

హైదరాబాద్ లో హాస్టళ్లను మూసివేస్తుండటంతో ఉన్నట్లుండి ఏపీకి విద్యార్థులు బయలుదేరారు. అయితే జగ్గయ్యపేట చెక్ పోస్టు వద్ద ఏపీ అధికారులు అడ్డుకున్నారు. తెలంగాణ పోలీసుల నుంచి నో [more]

Update: 2020-03-26 02:43 GMT

హైదరాబాద్ లో హాస్టళ్లను మూసివేస్తుండటంతో ఉన్నట్లుండి ఏపీకి విద్యార్థులు బయలుదేరారు. అయితే జగ్గయ్యపేట చెక్ పోస్టు వద్ద ఏపీ అధికారులు అడ్డుకున్నారు. తెలంగాణ పోలీసుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకున్నామని, తమను తమ ప్రాంతాలకు వెళ్లనివ్వాలని కోరారు. అయితే ఏపీ పోలీసులు అర్ధరాత్రి వరకూ వారిని అనుమతించలేదు. దీంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. చివరకు ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లు ఫోన్ లో మాట్లాడుకున్నారు. హాస్టల్స్ లో ఉండలేక వాళ్లు సొంత ఊళ్లకు వెళతామని చెప్పడం, వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందడంతోనే తాము ఎన్ఓసీ ఇవ్వాల్సి వచ్చిందని కేసీఆర్ జగన్ కు వివరించారు. ఇకపై ఎవరికీ ఎన్ఓసీని ఇవ్వబోమని కేసీఆర్ చెప్పడంతో వారిని ఏపీలోకి అనుమతించేందుకు జగన్ అంగీకరించారు. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతనే వారి ఇళ్లకు పంపుతామని అధికారులు చెప్పారు. ఇకపై తెలంగాణ నుంచి ఏపీలోకి ఎవరినీ అనుమతించే ప్రసక్తి లేదని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News