జాతీయ నేతలకు జగన్ సూటి ప్రశ్నలు

Update: 2018-11-17 12:58 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ... ఈ మధ్యకాలంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కొత్తగా పెళ్లి చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

- మోదీ పాలనతో విసిగిత్తె ధర్మపోరాట యుద్ధం చేస్తాడంట. ఇందుకు జాతీయ నేతలను కూడా తీసుకొవస్తాడట.

- చంద్రబాబు పిలిస్తే గంగిరెద్దుల్లా తల ఊపుతూ వచ్చే ఆ జాతీయ పార్టీలను రాష్ట్ర ప్రజల తరపున అడుగుతున్నా... ఇదే రాష్ట్రంలో చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొని రాజ్యాంగాన్ని తూట్లు పొడిచినప్పుడు ధర్మాపోరాటం గుర్తుకు రాలేదా ?

- దేశంలో ఎక్కడా జరగని విధంగా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను మంత్రులుగా చేస్తే సిగ్గులేకుండా ధర్మపోరాట దీక్షకు ఎలా వస్తున్నారు ?

- తిట్టిన నోటితోనే పొగడటం చంద్రబాబు నాయుడు రాజకీయ సిద్ధాంతం. తడిగుడ్డతో గొంతు కోయడం ఆయన సిద్ధాతం. సిగ్గూశరం రెండూ లేకుండా ఎవరి కాళ్లైనా పట్టుకోగలడు.

- చంద్రబాబులా నక్కజిత్తు పన్న గలిగిన నేత ప్రపంచంలోనే ఎవరైనా ఉంటారా ?

- ఆనాడు కాంగ్రెస్ దేశానికి హానీ అన్న చంద్రబాబు ఇవాళ దేశానికి కాంగ్రెస్ రక్షణ అంటున్నారు.

- ఇంతకుముందు సోనియా గాంధీ గాడ్సే అన్న బాబు ఇవాళ దేవత అంటున్నారు.

- అప్పుడు రాహుల్ గాంధీ మొద్దబ్బాయ్ అన్న ఆయనే ఇవాళ మేధావి అంటున్నారు.

- ఆనాడు సోనియా గాంధీ అవినీతి ఆనకొండ అన్న చంద్రబాబుకు ఇవాళ సోనియా గాంధీ ఆనందాల కొండ అయ్యింది.

- 2014 ఎన్నికల్లో జగన్ కి ఓటేస్తే కాంగ్రెస్ కి వేసినట్లు అన్నాడు. ఇవాళ జగన్ కి ఓటేస్తే బీజేపీకే అంటున్నాడు.

- ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కలిసి తానే వారందరినీ కలుపుతున్నానని పోజులిస్తున్నాడు.

- పుట్టే ప్రతి బిడ్డకు తన గురించి చెప్పాలని ఆశా వర్కర్లకు చెప్పారు. ప్రతి తల్లి చంద్రబాబు గురించి బిడ్డలకు చెబుతుంది. రావనాసురుడు, నరకాసురుడు, శిశుపాలుడి కంటే పెద్ద రాక్షసుడు చంద్రబాబు అని బిడ్డలకు చెబుతారు. వారిని మించిన రాక్షస పాలన చంద్రబాబుది అని ప్రతి తల్లీ చెబుతుంది.

- చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం నా పోరాటం ఆగదు. నా సంకల్పం సడలిపోదు. నా ఒంట్లో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పనిచేస్తా.

- చంద్రబాబులా డబ్బు కోసం ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేదు. డబ్బులంటే నాకు వ్యామోహం లేదు. చనిపోయిన తర్వాత కూడా నా ఫోటో ప్రతి ఇంట్లో పెట్టుకునేలా ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రిని అవ్వాలనుకుంటున్నాను.

Similar News