యూట్యూబ్ దొంగలు... వీరి రూటే సపరేటు

Update: 2018-08-14 11:04 GMT

యూట్యూబ్ లో చూస్తూ మోటర్ సైకిళ్లు ఎలా దొంగిలించాలో నేర్చుకుని దొంగిలిస్తూ పోలీసులకు చిక్కింది ఓ ముఠా. లంగర్ హౌస్ పోలీసులు ఈ ముఠాను అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించారు. మొత్తం యూట్యూబ్ లో చూసి దొంగతనాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు చేస్తూ ఉండగా పోలీసులు అనుమానంతో ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఈ ముఠా సభ్యులను పట్టుకున్నారు. పాతబస్తి సాయినగర్ కు చందిన ఐదుగురు యువకులను లంగర్ హౌస్ పోలీసులు పట్టుకున్నారు. పార్క్ చేసి ఉన్న వాహనాలను డూప్లికేట్ తాళాలతో ఓపెన్ చేసి బండిని తోసుకుంటూ వెళ్తుండగా పోలీసులు అనుమానంతో వాళ్లని పట్టుకున్నారు. వీళ్లు రూ.15 లక్షల విలువ చేసే కరిజ్మా, బుల్లెట్, ఎఫ్జీ, కేటీఎం వాహనాలను చోరీచేసినట్లు తెల్చారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు .

Similar News