ఇంటికి చేరుకున్న లారా
వాట్సాప్ చాటింగ్ ఇంటర్ విద్యార్థిని మూడు రోజుల పాటు ఇంటికి దూరం చేసింది. చాటింగ్ చేస్తున్న ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులు మందలించారు. దీంతో హైదరాబాద్ లోని తట్టి [more]
వాట్సాప్ చాటింగ్ ఇంటర్ విద్యార్థిని మూడు రోజుల పాటు ఇంటికి దూరం చేసింది. చాటింగ్ చేస్తున్న ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులు మందలించారు. దీంతో హైదరాబాద్ లోని తట్టి [more]
వాట్సాప్ చాటింగ్ ఇంటర్ విద్యార్థిని మూడు రోజుల పాటు ఇంటికి దూరం చేసింది. చాటింగ్ చేస్తున్న ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులు మందలించారు. దీంతో హైదరాబాద్ లోని తట్టి అన్నారం చెందిన లారా ఇంటి నుంచి వెళ్లిపోయింది. తట్టి అన్నారం కు చెందిన లారా ఇంటర్ చదువుతుంది.. లారా ఒక జంతు ప్రేమికురాలు. కుటుంబ సభ్యులు కూడా జంతు ప్రేమికులు పశుపక్ష్యాదుల తోపాటు అమితంగా ప్రేమిస్తారు వాటికి ఎలాంటి హాని జరిగినా నా కుటుంబం మొత్తం స్పందిస్తుంది అంతే కాకుండా ఇక్కడ ఎలాంటి సమాచారం వచ్చినా వెళ్లి వాటిని అడవిలోకి లేదంటే జూ పార్కు చేరుస్తారు. అలాంటి జంతు ప్రేమికుల ఇంట్లో లారా పెరుగుతుంది. మౌంట్ లితెర జీ స్కూల్ లో 12 వ తరగతి చదువుతుంది .ఈనెల 8వ తేదీన వాట్స్అప్ లో లారా చాటింగ్ చేస్తుంది . దీంతో తల్లిదండ్రులు మందలించారు. ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి పోయింది . ఫోన్ తనతో పాటు తీసుకోక పోవడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 8వ తేదీ నుంచి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. అయితే 8 తేదీ నుంచి ఇప్పటివరకు పోలీసులు సైతం కనుగొనలేకపోయారు. మరోవైపు హైదరాబాద్ తోపాటు ముంబై చెన్నై లో ఉన్న జంతు ప్రేమికులను కూడా పోలీసులు కాంటాక్ట్ చేశారు. ఇవాళ సాయంత్రం అనూహ్య రీతిలో లారా తన ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులు సంతోషించారు. తీవ్రమైన మానసిక ఒత్తిడితో పాటు అలసటతో ఉన్నారని కుటుంబ సభ్యులు చెప్పారు.