వాట్సాప్ కి కేంద్రం మూడు సూచనలు

Update: 2018-08-21 11:39 GMT

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కి కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. అసత్య వార్తలు, అశ్లీల దృశ్యాలు వాట్సాప్ ద్వారా వ్యాప్తి చెందకుండా చూడాలని సూచించింది. ఈ మేరకు మంగళవారం వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్స్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తో భేటీ అయ్యారు. భారత్ లో వాట్సాప్ సేవలు విస్తృతమవడంపై ఆయన అభినందనలు తెలిపారు. అయితే, వాట్సాప్ ద్వారా మంచితో పాటు చెడు కూడా జరుగుతోందని మంత్రి వివరించారు. వాట్సాప్ ను నియత్రించడానికి భారత్ లో ప్రత్యేకంగా ఓ అధికారి ఉండాలని, భారత చట్టాల గురించి అవగాహన తెచ్చుకుని వాటికి లోబడి వాట్సాప్ ను నియంత్రించాలని సూచించారు. వాట్సాప్ వల్ల ఏమైనా సమస్యలు తలెత్తితే అమెరికా నుంచి సమాధానాలు రావడం సరికాదని, వాట్సాప్ ను భారత్ లోని అత్యధికంగా వినియోగిస్తున్నందున భారత్ లో ప్రత్యేకంగా ఓ కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకోవాలని స్పష్టం చేశారు.

Similar News