బెజవాడలో ఆగడాలపై అమెరికా నుంచి ఫిర్యాదు

Update: 2018-06-12 06:44 GMT

బెజవాడలో గంజాయి గ్యాంగ్ ఆగడాలను అరికట్టాలని ఓ ఎన్ఆర్ఐ అమెరికా నుంచి ఫిర్యాదు చేశారు. అమెరికాలో ఉంటున్న విజయవాడకు చెందిన నూతక్కి నాగేశ్వర రావు ఇటీవల సొంత ఊరికి వచ్చారు. అక్కడ గంజాయి గ్యాంగ్ బ్లేడ్లు, కత్తులతో వీరంగం చేయడం చూసి ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆయన స్థానిక పోలీసులకు విషయం చెప్పినా లాభం లేకుడా పోయింది. అమెరికాకు వెళ్లిన ఆయన అక్కడి నుంచే విజయవాడ సీపీ సవాంగ్ కు ఈమెయిల్ ద్వారా గంజాయి గ్యాంగ్ పై తన గోడు వెళ్లబోసుకున్నారు. విద్యార్థులకు కూడా గంజాయి అమ్ముతున్నారని, విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైందని, మాచవరం పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ విక్రయాలు జరుగుతున్నాయని ఆయన ఫిర్యాదు చేశారు. గంజాయి గ్యాంగ్ వల్ల అటుగా స్కూల్ కి వెళ్లాలన్నా విద్యార్థులు భయపడుతున్నారు. ఈ గ్యాంగ్ ఆగడాలను అరికట్టాలని ఆయన కోరారు. అమెరికా నుంచి ఓ వ్యక్తి విజయవాడ పరిస్థితిపై ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

Similar News