జగన్ కు విజయశాంతి సూటి ప్రశ్న..!

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇవ్వడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. ఈ మేరకు [more]

Update: 2019-04-27 13:08 GMT

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇవ్వడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా జగన్ ను సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నందుకు, స్పీకర్ ఫిరాయింపులను ప్రోత్సహించారని రెండేళ్ల పాటు అసెంబ్లీని జగన్ బహిష్కరించారని గుర్తు చేశారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఉన్న జగన్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు ప్రలోభపెడుతున్న కేసీఆర్ తో కలిసి ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏపీలో తప్పైన ఫిరాయింపులు తెలంగాణలో ఎలా ఒప్పవుతుందని అడిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ ప్రలోభపెట్టడం జగన్ దృష్టిలో తప్పా, ఒప్పా అని సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.

Tags:    

Similar News