ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు

మహిళలను తాము నిర్లక్ష్యం చేయడం లేదని, రానున్న రోజుల్లో ఇద్దరు మహిళలను కచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. శనివారం ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. మహిళలకు [more]

Update: 2019-02-23 08:09 GMT

మహిళలను తాము నిర్లక్ష్యం చేయడం లేదని, రానున్న రోజుల్లో ఇద్దరు మహిళలను కచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. శనివారం ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. మహిళలకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి కోరారు. దీనికి ముఖ్యమంత్రి సమాధానమిస్తూ… మహిళలకు తామేమీ వ్యతిరేకం కాదని, నిన్న ప్రకటించిన ఎమ్మెల్సీల్లో కూడా మహిళలకు ఒక సీటు ఇచ్చామన్నారు. మహిళలను తాము నిర్లక్ష్యం చేయమని, వారి పట్ల తమకు చాలా గౌరవం ఉందన్నారు. ఇటీవలి ఎన్నికల్లో మహిళలే తమకు ఎక్కువ ఓట్లు వేశారని పేర్కొన్నారు.

మన అవసరముండే కేంద్ర ప్రభుత్వం రావాలి

కేంద్రం నిధుల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. దేశాన్ని సాకుతున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, పన్నుల రూపంలో 50 వేల 16 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి కేంద్రానికి వెళుతున్నాయన్నారు. కానీ, రాష్ట్రానికి కేంద్రం నుంచి తిరిగి వచ్చే నిధులు కేవలం 24 వేల కోట్లు మాత్రమే అని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మంచి పథకాలని, వీటికి 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ చేప్పినా కేంద్రం ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణ అవసరముండే కేంద్ర ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామని, అలా అయితే నిధుల వరద వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News