వావ్...తెలుగు రాష్ట్రాలకు సూపర్ ర్యాంకులు

Update: 2018-07-10 11:59 GMT

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రెండు తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. మంగళవారం కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంకు ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ రెండవ స్థానంలో ఉండగా, హర్యానా మూడో స్థానం సంపాదించింది. సంస్కరణలు, కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదికగా తీసుకుని ఈ ర్యాంకులు కేటాయించారు. జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు సంస్కరణల అమలులో 100 శాతం స్కోర్ చేశాయి. 95 శాతం స్కోర్ చేసిన 9 రాష్ట్రాలను ‘టాప్ అచావర్స్’గా గుర్తించారు. 90 నుంచి 95 శాతం సంస్కృరణలు అమలు చేసిన ఆరు రాష్ట్రాలను అచీవర్స్ గా ప్రకటించారు.

Similar News