టీఆర్ఎస్ తో పొత్తు ఉండదు.. తప్పుడు ప్రచారం ఆపండి

టీఆర్ఎస్ తో వైసీపీకి పొత్తు ఉండదని, కేవలం ఫెడరల్ ఫ్రంట్ విషయంపైనే జగన్ – కేటీఆర్ భేటీ జరిగిందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం [more]

Update: 2019-01-17 08:21 GMT

టీఆర్ఎస్ తో వైసీపీకి పొత్తు ఉండదని, కేవలం ఫెడరల్ ఫ్రంట్ విషయంపైనే జగన్ – కేటీఆర్ భేటీ జరిగిందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైసీపీపై టీడీపీ నేతల ఆరోపణలను ఆయన ఖండించారు. జగన్ – కేటీఆర్ మధ్య ఫ్రంట్ పై చర్చ జరిగితే టీడీపీ అనుకూల పత్రికలు ‘పొత్తు కుదిరింది’ అంటూ తప్పుడు వార్తలు రాశారని ఆరోపించారు. టీఆర్ఎస్ తో తమకు ఎటువంటి పొత్తూ ఉండదని, కేవలం జాతీయ స్థాయిలో ఒక వేదికపై పనిచేయాలనే దిశగా కేవలం ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగాయన్నారు.

హరికృష్ణ శవం సాక్షిగా కేటీఆర్ ని అడగలేదా…

హరికృష్ణ శవం సాక్షిగా టీఆర్ఎస్ తో కలుద్దామని చంద్రబాబు చర్చలు జరపలేదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెప్పిన వీడియోలను బొత్స మీడియా ముందు ప్రదర్శించారు. రాష్ట్రాల ప్రయోజనాల గురించి జగన్ – కేటీఆర్ చర్చిస్తే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం తమకంటే ముందు కేసీఆర్ చాలామంది నేతలను కలిశారన్నారు. టీడీపీ, టీడీపీ అనుకూల పత్రికల మాయమాటలను ప్రజలు నమ్మొద్దని కోరారు. చంద్రబాబుకు అవసరముంటే తెలుగు ప్రజలు సోదరులు అంటారని, అవసరం లేకపోతే మనోబావాలు అంటూ చిచ్చు పెడతారన్నారు.

Tags:    

Similar News