త్రివిక్రమ్ - ఎన్టీఆర్ లు కలిసి...!!

Update: 2018-04-11 12:11 GMT

ప్రస్తుతం జిమ్ లో వర్క అవుట్స్ చేస్తున్న ఎన్టీఆర్... త్రివిక్రమ్ సినిమా కోసం రెడీగా వున్నాడు. త్రివిక్రమ్ పూర్తి స్క్రిప్ట్ తో ప్రీ ప్రొడక్షన్ ని పూర్తి చేసుకుని ఎన్టీఆర్ తో సినిమా కోసం సమాయత్తమవుతున్నాడు. పూజా కార్యక్రమాలు ఎంతో గ్రాండ్ జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరో రెండు రోజుల్లో మొదలు కాబోతుంది. ఈ నెల 13వ తేదీన త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా ఫస్టు షెడ్యూల్ ను హైదరాబాద్ లో మొదలుపెట్టనున్నాడు. 13 నుండి 25 వరకు ఏకధాటిగా ఈ సినిమా షూటింగ్ కొనసాగనుంది.

యాక్షన్ షెడ్యూల్.....

అయితే 13 నుండి 25 వరకు కొనసాగే షూటింగ్ షెడ్యూల్ లో మొత్తం యాక్షన్ ఎపిసోడ్ గా ఉండనుంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ మరికొందరి విలన్స్ మీద ఈ యాక్షన్ షెడ్యూల్ ని ప్లాన్ చేసాడట త్రివిక్రమ్. రామ్ - లక్ష్మణ్ అధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కనుందట. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో ఉన్న ఫైట్స్ కి భిన్నంగా ఈ యాక్షన్ ఎపిసోడ్ ను త్రివిక్రమ్ తో కలిసి రామ్ - లక్షణ్ డిజైన్ చేశారట. మరి సెట్స్ మీదకెళ్ళిన వెంటనే యాక్షన్ తో ఎన్టీఆర్ కుమ్మేస్తాడన్నమాట. హారిక హాసిని బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా...సీనియర్ హీరోయిన్స్ లయ, మీనా పేర్లు కూడా కాస్త గట్టిగానే వినబడుతున్నాయి. అయితే నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Similar News