బ్రేకింగ్ : అఖిలప్రియ బెయిల్ పిటీషన్ 11కు వాయిదా

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పై విచారణ వాయిదా పడింది. అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అఖిలప్రియపై తప్పుడు [more]

Update: 2021-01-08 12:12 GMT

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పై విచారణ వాయిదా పడింది. అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అఖిలప్రియపై తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. అఖిలప్రియకు బెయిల్ పై బయటకు వస్తే సాక్షులను బెదిరించే అవకాశముందన్నారు. అఖిలప్రియ రాజకీయంగా, ఆర్థికంగా ప్రభావం గల చేయగల స్థితిలో ఉందన్నారు. బెయిల్ ఇస్తే ఆమె విచారణ నుంచి తప్పించుకోవచ్చని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితిని తెలియజేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. అఖిలప్రియ ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని, వెంటనే ఈఎన్టీ వైద్య నిపుణుడి వద్దకు తరలించాలని అఖిలప్రియ తరుపున న్యాయవాది కోరారు.

Tags:    

Similar News