చంద్రముఖీ....ఎక్కడున్నావ్...??

Update: 2018-11-28 04:13 GMT

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న చంద్రముఖి కన్పించడం లేదు. చంద్రముఖి ట్రాన్స్ జెండర్. ఆమె బీఎల్ఎఫ్ తరుపున గోషామహల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే నిన్నటి నుంచి గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్థి చంద్రముఖి కన్పించడం లేదు. ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది. దీంతో బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు ట్రాన్ జెండర్స్, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేశారని చెబుతున్నారు. చంద్రముఖి బంజారాహిల్స్ లోని ఇందిరా నగర్లో నివాసముంటున్నారు. అయితే నిన్న కన్పించకుండా పోయిన చంద్రముఖి నేటికీ కన్పించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రంలోగా చంద్రముఖి ఆచూకీ కనుగొనకపోతే తాము ఎన్నికల అధికారి కార్యాలయం ముందు ధర్నా చేస్తామని బీఎల్ఎఫ్ నేతలు అల్టిమేటం ఇచ్చారు. చంద్రముఖి ఆచూకీ కనుగునేందుకు ప్రత్యేక పోలీసులు రంగంలోకి దిగారు.

Similar News